నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం కనకదుర్గ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చీరలు పంపిణీ చేశారు. మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా 283 సంఘాలకు ఇరువై తొమ్మిది కోట్ల ఎనబై ఆరు లక్షల యాబై వేల రూపాయల ఋణాల పంపిణీ చెక్కను మంత్రి సీతక్క అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి సీతక్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



