Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామాజికసేవలో లయన్స్ క్లబ్ ది ప్రత్యేక పాత్ర

సామాజికసేవలో లయన్స్ క్లబ్ ది ప్రత్యేక పాత్ర

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
సామాజిక సేవలో లైన్స్ క్లబ్ ది ప్రత్యేక పాత్ర అని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ జూలూరు రమేష్ బాబు, తహసిల్దార్ ఉమా, ఎస్సై వీరబాబులు అన్నారు. శనివారం చారకొండ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ కల్వకుర్తి, లైన్స్ క్లబ్ ఆమనగల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను అభినందించడంతోపాటు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

శిబిరంలో 265మందికి ఉచితంగా డయాబెటిక్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు చిగుళ్ల పల్లి శ్రీధర్, జోన్ చైర్మ న్ జూలూరి లింగయ్య, చార్టర్ ప్రెసిడెంట్ కల్మచర్ల రమేష్, ప్రచార కార్యదర్శి గణేష్, మేకల శ్రీనివాస్, గందె రవి, క్యాంపు చైర్మన్ వాడకట్టు సంపత్ కుమార్. నిర్వాహకులు శ్యాంసుందర్, రాముని రామనాథం మాజీ జెడ్పిటిసి వెంకట్ గౌడ్, మాజీ ఎంపిటిసి బలరాం, గజ్జె యాదయ్య, మండల ఆర్య సంఘ అధ్యక్షుడు రాచమల్ల చంద్రశేఖర్, లక్ష్మణ్, జెసిబి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -