Saturday, November 22, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పొన్కల్, జన్నారం పేదలకు స్థలాలివ్వాలి..

పొన్కల్, జన్నారం పేదలకు స్థలాలివ్వాలి..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని పొన్కల్, జన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామీణ నిరుపేదలకు స్థలాలను కేటాయించాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర నాయకుడు నేతావత్ రాందాస్, జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య డిమాండ్ చేశారు. శనివారం బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహశీల్దార్ రామ్మోహన్ రావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. నిరుపేదల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 72,73, 74 లలో దాదాపు 3 ఎకరాల ప్రభుత్వ  అసైన్డ్ భూమి ఉందన్నారు. ఈ భూమిని ఇల్లు లేని నీరు పేదలకు కేటాయించాలని గతంలో ఎన్నోసార్లు కలెక్టర్ తాసిల్దార్ వినతి పత్రం అందించిన వారు స్పందించలేదన్నారు.

అందుకే శనివారం తెల్లవారుజామున ఆ స్థలంలో ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకోవడం జరిగిందన్నారు.. ఆ భూమిలో ఇవ్వడానికి కుదరకపోయినా నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని మరెక్కడ ఇచ్చిన ప్రభుత్వం అధికారులు ఇచ్చిన స్థలంలోనే గుడిసెలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వకపోతే గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా నాయకులు  వేముల నరసయ్య  రాజమౌళి ఇల్లు లేని నిరుపేదలు మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -