Sunday, November 23, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపోరాడి సాధించుకున్న హక్కులకు భంగం

పోరాడి సాధించుకున్న హక్కులకు భంగం

- Advertisement -

లేబర్‌ కోడ్స్‌ను రద్దుచేయాలంటూ కార్మికుల నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం

నవతెలంగాణ-విలేకరులు
పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి బడాబాబులకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్స్‌ను అమలుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో సింగరేణి కాలరీస్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎస్‌సీసీ డబ్ల్యూయూ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బ్రహ్మానందం ఆధ్వర్యంలో లేబర్‌ కోడ్‌ ప్రతులను దహనం చేశారు. శ్రీరాంపూర్‌ ఉపరితల గనిలో కాంట్రాక్ట్‌ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జన్నారం మండలం పొన్కల్‌ గ్రామపంచాయతీ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. తాండూర్‌ మండలకేంద్రంలో రాస్తారోకో చేశారు.

మంచిర్యాల కలెక్టరేట్‌ ఎదుట కార్మికులు బైటాయించి నిరసన తెలిపారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులు ఏపీరాక్‌ మైనింగ్‌ ఇండియా వద్ద గేజిట్‌ కాపీలను దహనం చేశారు. నాచారం పరిశ్రమ ప్రాంతంలోని తెలంగాణ ఫుడ్స్‌ వద్ద కోడ్‌ ప్రతులను దహనం చేశారు. ఘట్‌కేసర్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వద్ద ఒంటి కాలుపై నిల్చొని నిరసన తెలిపారు. అలియాబాద్‌ మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికులు నిరసన తెలిపారు. బాచుపల్లి మండలం ప్రగతినగర్‌లోని బాలానగర్‌ చౌరస్తా పారిశ్రామిక ప్రాంతంలో లేబర్‌ కోడ్‌ల పత్రాలను దహనం చేశారు. షాపూర్‌ నగర్‌ రైతు బజార్‌ నుంచి ఉషోదయ టవర్స్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. హయత్‌నగర్‌ డిపో ముందు ప్లకార్డులు, నల్లజెండాలతో కార్మికులు ఆందోళన చేప ట్టారు. నిజామాబాద్‌లోని ధర్నాచౌక్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇబ్రహీంపట్నం లేబర్‌ అడ్డాలో నాలుగు లేబర్‌కోడ్‌ల అమలుకు జారీ చేసిన ఉత్త ర్వులను దహనం చేశారు. కొత్తూరులోని ఐఓసీఎల్‌ కార్మి కులతో కలిసి నిరసన చేపట్టారు. కందుకూరు మండల కేంద్రంలో శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ ప్రధాన రహదా రిపై గంటపాటు ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వికారాబాద్‌ జిల్లా తాం డూర్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఖ మ్మంజిల్లా ఖమ్మంరూరల్‌ మండలం వరంగల్‌ క్రాస్‌ రోడ్‌ లో, మధిరలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, ఇల్లందు పట్టణా ల్లో జీవో ప్రతులు దహనం చేశారు. సంగారెడ్డిలో కలె క్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కొండాపూర్‌ క్లస్టర్‌ పరిధిలోని మల్లేపల్లి చౌరస్తాలో జీఓ ప్రతులను దహనం చేశారు.

ఐడీఏ పాశమైలారం బీడీఎల్‌ చౌరస్తాలో ఆందో ళన చేపట్టారు. సిద్దిపేట జిల్లా ములుగు, గజ్వేల్‌లో ధర్నా నిర్వహించారు. నల్లగొండలోని బేవరేజ్‌ డిపో ఎదుట నిర సన తెలిపారు. చండూరు, కట్టం గూరులో నిరసన తెలి పారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో ఐఎఫ్‌ టీయూ ఆధ్వర్యంలో జీవో ప్రతులను దహనం చేశారు. మహబూబ్‌నగర్‌లో మున్సిపల్‌ కార్యాల యం ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. భూత్పూర్‌లో జీవో కాపీలను దహనంచేశారు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్ప త్రి సమీపంలోని హైదరాబాద్‌- రాయచూరు రోడ్డుపై తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐ టీయూసీ) ఆధ్వర్యంలో జీవో పత్రాలను దహనంచేశారు. నాగర్‌కర్నూల్‌లో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన చేశారు. మహబూబాబాద్‌లోని నెహ్రూ సెంటర్‌, స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా వద్ద లేబర్‌కోడ్‌ ఉత్త ర్వుల పత్రాలను దహనం చేశారు. ములుగు జిల్లా గోవిం దరావు పేట మండలం పస్రాలో నోటిఫికేషన్‌ ప్రతులను దహనం చేశారు. జనగామలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద లేబర్‌ కోడ్‌ ఉత్తర్వుల పత్రాలను దహనంచేశారు. హనుమ కొండ జిల్లా మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఉదయం 5గంటలకే నిరసనలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -