Sunday, November 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంన్యాయశాస్త్ర విభాగంలో కిరణ్‌గౌడ్‌కు డాక్టరేట్‌

న్యాయశాస్త్ర విభాగంలో కిరణ్‌గౌడ్‌కు డాక్టరేట్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) న్యాయశాస్త్ర విభాగంలో గుండగాని కిరణ్‌గౌడ్‌కు డాక్టరేట్‌ లభించింది. ప్రొఫెసర్‌ జిబి రెడ్డి పర్యవేక్షణలో ‘డిస్ట్రిబ్యూషన్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ కాన్‌స్టిట్యూషన్‌ ఏ క్రిటికిల్‌ స్టడీ’అనే అంశంపై విశ్లేషణాత్మక పరిశోధనకుగాను ఆయన డాక్టరేట్‌ను ఓయూ ప్రదానం చేసింది. సామాజిక, విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూనే ఉన్నత విద్యలో ఆయన ప్రతిభను చూపారు. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని గానుగుబండ గ్రామం. తల్లిదండ్రులు దుర్గయ్య, సుశీలకు ఆయన రెండో సంతానం.

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కిరణ్‌గౌడ్‌ దశాబ్ధన్నరకుపైగా విద్యార్థి ఉద్యమాలు, రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. డాక్టరేట్‌ పట్టా పొందిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది అత్యున్నత డిగ్రీనే కాదనీ, వ్యక్తి పరిశోధన సామర్థ్యానికి, అంకితభావానికి, జ్ఞానానికి నిదర్శనమని అన్నారు. ఈ పరిశోధనలో విలువైన సలహాలు, సూచనలు చేస్తూ మార్గదర్శకం చేసి ప్రొఫెసర్‌ జిబి రెడ్డితోపాటు సంపూర్ణ సహకారం అందించిన అధ్యాపకులు, సిబ్బందికి ధన్యదాదాలు చెప్పారు. కిరణ్‌గౌడ్‌కు డాక్టరేట్‌ పట్టా రావడం పట్ల అధ్యాపకులు, రాజకీయ ప్రముఖులు, విద్యార్థి సంఘాల నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -