Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘం కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

మహిళా సంఘం కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహిళా సంఘం సభ్యులకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం మద్నూర్ మండల కేంద్రంలోని మహిళా సంఘం కార్యాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, దన్నూర్ దేవదాసు పటేల్ ల చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ.. మహిళలకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకుంటుందని, మహిళల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. చీరల పంపిణీ కార్యక్రమంలో ఐకెపి మహిళా సంఘం వివోఏలు మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -