హీరో సుమంత్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘గోదారి గట్టుపైన’. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్‌కు ఇది ఫస్ట్ వెంచర్. ఎంఆర్ ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘చూడు చూడు (సైడ్ ఎ)’ లిరికల్ వీడియోను విడుదల చేశారు. నాగ వంశీ కృష్ణ కంపోజ్ చేసిన ఈ సాంగ్ నదీ తీరాల సువాసనను తీసుకుని వచ్చే ఈదురుగాలిలా అనిపిస్తుంది. ప్రేమను రంగుల్తో నింపే ఈ ట్యూన్ హృదయాన్ని నాట్యం చేయిస్తుంది. ఫ్లూట్, వయోలిన్, నాదస్వరంలాంటి వాద్యాలతో సంగీతానికి సున్నితమైన క్లాసిక్ టచ్‌ని అందించారు.
హరి చరణ్ వోకల్స్ ఈ పాటకి మరింత మాధుర్యాన్ని జోడిస్తే, లిరిసిస్ట్ దినేష్ కాకర్ల హీరో ప్రేమలో ఉన్న అందమైన, చురుకైన అమ్మాయిని కవితాత్మకంగా వర్ణించారు. సుమంత్ ప్రభాస్ తన స్మూత్ డాన్స్ మూమెంట్స్‌తో ఉత్సాహం, ఉల్లాసాన్ని తీసుకువచ్చారు. హీరోయిన్ నిధి ప్రదీప్ యాటిట్యూడ్‌తో పాటు మృదుత్వాన్ని కలగలిపి మెరిసిపోయింది. కొరియోగ్రఫీ బ్యూటీఫుల్‌గా ఉంది. దీంతో ఈ సినిమా మ్యూజిక్ జర్నీ బ్లాక్ బస్టర్ నోట్‌తో మొదలైంది అని చిత్రయూనిట్ తెలిపింది. రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి రచన, దర్శకత్వం – సుభాష్ చంద్ర, నిర్మాత – అభినవ్ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మధులిక సంచన లంక, డీఓపి – సాయి సంతోష్, సంగీతం – నాగ వంశీ కృష్ణ, ఎడిటర్ – అనిల్ కుమార్ పి, ప్రొడక్షన్ డిజైనర్ – ప్రవల్య డి.
ఆహ్లాదకరమైన ప్రేమ పాట’చూడు.. చూడు’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



