దాదాపు నాలుగోవంతు వాళ్లే..
న్యూయార్క్ : ట్రంప్ నిర్ణయాలతో విదేశీయులలో గందరగోళ పరిస్థితి నెలకొంది. హెచ్ -1 బీ వీసా రుసుం పెంపుతో అమెరికా వైద్య సిబ్బందిలో దాదాపు నాలుగో వంతు మంది ఉన్న విదేశీ శిక్షణ పొందిన వైద్యుల్లో అయోమయ పరిస్థితి కనిపిస్తోంది. గతంలో..అమెరికాలో పనిచేయడానికి వైద్యుల వీసాను స్పాన్సర్ చేయడానికి ఆస్పత్రులు సుమారు రూ.ఐదు లక్షలు చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వైద్యుడికి రూ. 90 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై హౌ ఇమ్మిగ్రెంట్ ఫిజిషియన్స్ చేంజ్డ్ యూఎస్ హెల్త్‌కేర్ అనే పుస్తక రచయిత , అసోసియేట్ ప్రొఫెసర్ ఎరామ్ ఆలం ప్రకారం.. ఇది ఊహించని భారమేనని చెప్పారు.
ముఖ్యంగా యూఎస్‌లోని అనేక ఆస్పత్రులు ఈ అదనపు ఖర్చులను భరించకపోవచ్చని, అందువల్ల తమ వైద్యవృత్తిని వదిలి వెళ్ళవలసి వస్తుందని వివరించారు. లక్షలాది మంది అమెరికన్లకు సంరక్షణ అందించడంలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంటూ, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధిక రుసుముల నుంచి వైద్యులను మినహాయించాలని న్యాయస్థానాల్లో పిటిషన్ దాఖలు చేసింది. అమెరికన్ వైద్యానికి వలస వైద్యులు వెన్నెముకగా మారారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు , వనరులు తక్కువగా ఉన్న పట్టణ సమాజాలలో ఉన్నారని ఆలం అన్నారు. ఈ వైద్యులు తరచుగా అమెరికన్ శిక్షణ పొందిన వైద్యులు నివారించే అంతరాలను పూర్తిస్తారు, అవసరమైన చోట సంరక్షణ అందిస్తారు అని హార్వర్డ్ గెజిట్ నివేదించింది. ఎందుకంటే అమెరికన్ శిక్షణ పొందిన వైద్యులు సాధారణంగా ఎక్కువ లాభదాయకమైన లేదా ప్రతిష్టాత్మకమైన పదవులను ఇష్టపడతారు.
నేడు, యునైటెడ్ స్టేట్స్‌లో 200000 నుంచి 300000 మంది విదేశీ వైద్యులు ఉన్నారు, వీరిలో చాలామంది ప్రాథమిక సంరక్షణ లేదా తక్కువ లాభదాయకమైన ప్రత్యేకతలను అభ్యసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది భారతదేశం, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఇటీవల నైజీరియా నుంచి వలస వైద్యులు వచ్చారు. చాలా మంది గ్రామీణ ఆస్పత్రులలో పనిచేస్తున్నారు. అక్కడ వైద్య సిబ్బందిలో వలస వైద్యులు 100 శాతం ఉండవచ్చు.తొలి వలస వైద్యులు తరచుగా సామాజికంగా, సాంస్కృతికంగా ఒంటరిగా ఉన్నట్టు భావించారని ఆలం అన్నారు.
అయితే దశాబ్దాలుగా, ముఖ్యంగా దక్షిణాసియా వైద్యులు వైద్యం , ప్రజా జీవితంలో ముఖ్యమైన వైద్య సేవకులుగా మారారు, వలస వైద్యులు అమెరికా ఆరోగ్య సంరక్షణకు చాలా అవసరమని, కానీ ఈ వైద్యులు వలస వెళ్ళినప్పుడు వారి స్వదేశాలు వైద్య ప్రతిభను కోల్పోతాయని ఆలం అన్నారు. చాలా మంది స్థానిక పన్ను చెల్లింపుదారుల డబ్బుతో శిక్షణ పొందుతారు, ఇది యబఎస్ వైద్యుల అంతరాన్ని పరిష్కరించడంలో సహాయపడుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొరతను సృష్టిస్తుంది.విదేశాల నుంచి వైద్యులను దిగుమతి చేసుకోవడంపై ఆధారపడకుండా, ప్రపంచవ్యాప్తంగా వైద్య నైపుణ్యాన్ని పంచుకునేలా తగినంత మంది వైద్యులకు శిక్షణ ఇవ్వడం , ఉత్పత్తి చేయడంలో అమెరికా పెట్టుబడి పెట్టాలని ఆలం అన్నారు.
హెచ్ -1 బీ వీసా రుసుం పెంపుతో..విదేశీ వైద్యులకు కష్టకాలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



