- Advertisement -
యువ వైద్యురాలి ఆత్మహత్య
హైదరాబాద్ : గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడాది నుంచి ఆమె అమెరికా వీసా కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జే1 వీసా రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన డాక్టర్ రోహిణి హైదరాబాద్‌లోని నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలన్న ఆశయంతో కష్టపడి చదివిన రోహిణి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.
- Advertisement -



