Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆసక్తి పెంపోదించడానికి సైకిళ్ల పంపిణీ..

ఆసక్తి పెంపోదించడానికి సైకిళ్ల పంపిణీ..

- Advertisement -

-బీజేపీ రాష్ట్ర నాయకుడు కరివేద మహిపాల్ రెడ్డి
నవతెలంగాణ – బెజ్జంకి

విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంపోదించడానికి..రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైకిళ్ల పంపిణీకీ శ్రీకారం చుట్టారని బీజేపీ రాష్ట్ర నాయకుడు కరివేద మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వోన్నత పాఠశాల అవరణంలో సుమారు 34 మంది విద్యార్థినీ, విద్యార్థులకు మహిపాల్ రెడ్డి ఎంఈఓ, రాష్ట్ర నాయకుడు సొల్లు అజయ్ వర్మ, టౌన్ అధ్యక్షుడు సంగ రవితో కలిసి సైకిళ్లు పంపిణీ చేశారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని సొల్లు అజయ్ వర్మ అన్నారు. అధికారం చేపట్టాక 100 రోజుల్లో మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అటకెక్కిందని..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ..హామీలకే పరిమితం చేయకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలని అజయ్ వర్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -