నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడిచినా ప్రజలకు చేసిందేమీ లేదని, అన్ని వర్గాలను మోసం చేసిందని పాలమూరు ఎంపీ డీకే అరుణ తీవ్రంగా విమర్శించారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఆమె ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులోనూ పక్షపాతం చూపిస్తున్నారని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తున్నారని ఆరోపించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో సరైన ప్రభుత్వ వైద్య సేవలు లేకపోవడం దారుణమన్నారు. చేనేత కార్మికులకు సబ్సిడీ రుణాలు అందించాలని, మహిళల కోసం జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, ఈ మోసాలకు మహిళలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు: ఎంపీ డీకే అరుణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



