నవతెలంగాణ – మిర్యాలగూడ
విద్యార్థినిలకు మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక యుటిఎఫ్ భవనంలో సోమవారం గర్ల్స్ కన్వేక్షన్ ప్రసన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో విద్యార్థినిలు, మహిళలపై హత్యలు అగైత్యాలు లైంగిక వేధింపులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో విద్యార్థుల పాత్ర చాలా గొప్పదని ఆడవారు వంటింటి కుందేలు కాదని సమాజంలో సగభాగంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తూ మగవారితో సమానంగా ఎంతో పనిచేస్తున్న నేటికీ సమాజం ఆడవారిని బానిసల్లాగా చూడటం దుర్మార్గమన్నారు.
ఈ సమాజంలో మహిళలపై జరిగే దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నూతన గర్ల్స్ కమిటీ పని చేయాలని అన్నారు. విద్యార్థులు అధ్యయనం పోరాటంతో ముందుకు సాగాలన్నారు. ఎంతోమంది విద్యార్థుల త్యాగ పోరాటం ఫలితంగా నిర్భయ చట్టాలు వచ్చిన అధికార పార్టీ నాయకులకు చుట్టాలుగా మారాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో పాలకులు ఘోరంగా విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత విద్యార్థులు మాదకద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకుంటే ఉన్నత స్థానాలకు ఎదిగవచ్చన్నారు.అప్పుడే సమాజంలో విద్యార్థులపై మహిళలపై దాడులు దౌర్జన్యాలు తగ్గుతాయని అన్నారు. ముఖ్యంగా పోలీసు షీ,టీమ్ లను అన్నీ జూనియర్ కళాశాలలో గురుకుల పాఠశాలలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అవగాహన సదస్సు లాంటి పెట్టి విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపాలని కోరారు.
ఈసమావేశంలో ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్, తాప్రా సంఘం జిల్లా అధ్యక్షులు నూకలు జగదీష్ చంద్ర, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లు గౌతమ్ రెడ్డి మూడవత్ జగన్ నాయక్ ధీరవత్ వీరన్న నాయక్, సభ్యులు బన్నీ, వెంకటేష్, సుభాని, మమత, కీర్తన, ప్రసన్న, కావ్య, అంజలి, హసీనా పాల్గొన్నారు.



