Monday, November 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్స్థానిక సంస్థల్లో బీసీలకు మొండిచేయి

స్థానిక సంస్థల్లో బీసీలకు మొండిచేయి

- Advertisement -

సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తాం..
బీసీ సంఘ నాయకులు..
నవతెలంగాణ – జన్నారం

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందని, బీసీ సంక్షేమ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు కాసెట్టి లక్ష్మణ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రజావాణిలో తమకు రిజర్వేషన్లు తక్కువగా వచ్చాయని జనాభా దామాషా ప్రకారం, తమకు రావలసిన రిజర్వేషన్లను  ఇవ్వాలని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కు వినతి పత్రం అందించారు.

అనంతరం మండల కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిందన్నారు. జన్నారం మండలంలో మొత్తం 29 గ్రామపంచాయతీలు ఉండగా, కేవలం రెండు గ్రామపంచాయతీలే బీసీలకు రిజర్వ్ చేయడం సరైంది కాదన్నారు. రెండు గ్రామపంచాయతీలో అయితే కనీసం బీసీలు ఒక్కరు కూడా వార్డ్ మెంబర్ పోటీ చేయ లేకుండా  రిజర్వేషన్లు ఉన్నాయి అన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను ప్రకటించాలన్నారు.

లేకుంటే జన్నారం మండలంలోని అన్ని గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు. రాస్తారోకో నిర్వహిస్తున్న సమయంలో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి, సంఘ నాయకులతో మాట్లాడారు. సమస్యను ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకెళ్తామనడంతో రాస్తారోకోన విరమించారు. కార్యక్రమంలో  బీసీ సంక్షేమ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్లు కడారుల నరసయ్య, కొంతం శంకరయ్య, బాలసాని శ్రీనివాస్ గౌడ్, ఆడెపు లక్ష్మీనారాయణ, సులువ జనార్ధన్, ఆండ్రా పురుషోత్తం, వాసాల నరేష్, వైస్ మాజీ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, ఇప్ప రాకేష్, అప్పల జలపతి  దాసరి రాజన్న మహేష్, సంద గోపాల్, ఉప్పు చంద్రశేఖర్, వీరికి సీపీఐ(ఎం) నాయకులు మద్దతులు ప్రకటించారు. సీపీఐ(ఎం) పార్టీ జిల్లా నాయకులు కనికారం అశోక్, మగ్గిడి జయ, తదితర బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -