– నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోనీ పలు కాలనీల్లో నెలకొన్న తాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరాను ప్రారంభించారు. సోమవారం నవతెలంగాణలో ‘కమ్మర్ పల్లిలో ప్రజలకు నీటి కష్టాలు, శీర్షికన పచురితమైన కథనానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ స్పందించారు. తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్న ఎస్సీ, బీసీ కాలనీలతో పాటు గ్రామంలో ఉదయం, సాయంత్రం వాటర్ ట్యాంకర్ ద్వారా ప్రజలకు నీటిని అందించాలని ఆయన గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంకర్ ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేశారు. ట్యాంకర్ వద్ద కాలనీవాసులు వరుస క్రమంలో వచ్చి నీటిని పట్టుకున్నారు.వాటర్ ట్యాంకర్ ద్వారా మంచి నీటిని సరఫరా చేయడం పట్ల ఎస్సీ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.మూడు నెలలుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కారమయ్యే విధంగా కృషి చేసిన నవతెలంగాణ పత్రికకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
కాలనీలో వాటర్ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



