నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 386లో ఉన్న వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటున్న రైతులకు రైతుబంధు ఇప్పించాలని కోరుతూ పలువురు రైతులు సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. సర్వే నంబర్ 386లో సంవత్సరాల నుండి ఎంతోమంది రైతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. గత రెండు దపాల నుండి రైతుబంధు డబ్బులు రావడం లేదని విన్నవించారు. గ్రామంలో సుమారు వెయ్యి ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉన్న కూడా రైతుబంధు రావడంలేదని, తమ సమస్యను పరిష్కరించి రైతులందరికీ రైతుబంధు ఇప్పించాలని వినతిపత్రంలో వేడుకున్నారు. కార్యక్రమంలో రైతులు బద్దం రాజశేఖర్, నూకల బుచ్చి మల్లయ్య, పెంట కిషన్, రాజేశ్వర్, పెంట పురుషోత్తం, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
రైతుబంధు ఇప్పించాలని ప్రజావాణిలో వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



