Monday, November 24, 2025
E-PAPER
Homeకరీంనగర్రేపు ఎస్ హెచ్ జీలకు వడ్డీ లేని రుణాల పంపిణీ

రేపు ఎస్ హెచ్ జీలకు వడ్డీ లేని రుణాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలు(ఎస్ హెచ్ జీ)లు ఇందిరా మహిళా శక్తి కింద వడ్డీలేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లాలోని 8871 ఎస్ హెచ్ జీ)లకు దాదాపు రూ.8 కోట్ల 12 లక్షలు వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం మొదటి విడతలో 7802 ఎస్ హెచ్ జీ లకు రూ. 7 కోట్ల 40 లక్షలు, రెండో విడతలో రూ. 8552 ఎస్ హెచ్ జీ లకు రూ. 11 కోట్ల 78 లక్షల వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. వేములవాడ పట్టణంలోని రామలింగేశ్వర గార్డెన్ లో ఉదయం 11.00 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. అలాగే జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మధ్యాహ్నం 01.00 గంటలకు సిరిసిల్ల నియోజకవర్గం ఎస్ హెచ్ జీ ల బాధ్యులకు పంపిణీ చేయనున్నామని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -