నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూరు మండల కేంద్రంలోని అని గ్రామాలకు గంగపుత్రుల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకొని చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అధికారుల, నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలకు 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను నిర్వహిచారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గంగపుత్రుల జీవనోన్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చేపల పెంపకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల చెరువుల్లో చేప పిల్లలను వదిలి ఉత్పాదకతను పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వైస్ మల్లారెడ్డి, ఆలూర్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కెర విజయ,బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ అరుణ్ ఓబీసీ అధ్యక్షుడు నాడీశరం మల్లయ్య, ఇందిరమ్మ కమిటీ మెంబెర్ సంజీవ్, చిరంజీవి, నాయకులు కిషన్, ఎల్ఐసి గంగన్న , గంగారాం, ఓడ్డెన్న , పోశెట్టి, ఫీల్డ్ ఆఫీసర్ జీవన్ తదితరులు పాలుగోన్నారు.
ఆలూర్ లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



