Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి: కలెక్టర్

జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా స్థాయి పూర్వ ప్రాథమిక బోధకుల ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 70 ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం పూర్వ ప్రాథమిక విద్యను అధికారికంగా ప్రారంభించడం జరిగిందని, ఈ పాఠశాలల్లో బోధకులు,  ఆయాలను నియమించామని  పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేయబడిన పూర్వ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధి కోసం వాటిలో ఫర్నిచర్ క్రీడా పరికరాలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

అన్ని పాఠశాలలలో విద్యార్థులను ఆకర్షణీయంగా నిలిచే విధంగా రంగు రంగులతో గదులను పెయింటింగ్ వేయించడం జరుగుతుందని, నూతనంగా ఎంపికైన బోధకులు పూర్తిస్థాయి ఆసక్తితో విద్యార్థులను ఆటపాటలతో ఆడిస్తూ నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని కోరారు. తరగతి గదిలో విద్యార్థులను ఆకట్టుకునే విధంగా జాయ్ ఫుల్ లర్నింగ్ క్లాస్ రూమ్ వాతావరణం ఉండాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం వరకు ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి  రాజు, అకాడమీ అధికారి వేణుగోపాల్ , కమ్యూనిటీ  మొబిలైజేషన్ అధికారి నాగవేందర్, రిసోర్స్ పర్సన్స్ నర్సింగ్ రావు, హరి ప్రసాద్, లింబాద్రి నవీన్ , ప్రశాంత్, భవాని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -