- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని దేవి దియేటర్ ప్రక్కన గల సార్వజనిక్ స్మశాన వాటికలో మంగళవారం గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందిన గుర్తు తెలియని ఓ అనాధ శవానికి 1వ ఠాణా పోలిస్ సిబ్బంది అనుమతితో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, సదాశివ, పురుషోత్తం రెడ్డి,నరేష్ రెడ్డి, 1వ ఠాణా పోలిస్ సిబ్బంది రాజ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



