Tuesday, November 25, 2025
E-PAPER
Homeజిల్లాలునాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి: సీఐటీయూ

నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.వి. నరసింహ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్ వల్ల కనీస వేతన హక్కును కోల్పోతారని, ప్రభుత్వంతో తమ సమస్యలపై చర్చలు జరిపే అవకాశాన్ని కోల్పోతారాని, కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తారని అన్నారు.

కార్మికులు సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు సంఘటితమయ్యే హక్కును కాల రాస్తున్నారని లేబర్ కోడ్ లు రద్దు చేస్తాయని విమర్శించారు. మున్సిపాలిటీలలో నెలల తరబడి వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వడం లేదని, కార్మికులకు ఎటువంటి రక్షణ సదుపాయాలు కల్పించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం( IFMIS )ఆన్లైన్ పోర్టల్ లో మున్సిపల్ ఉద్యోగ కార్మికులందరినీ నమోదు చేయాలని, తొలగింపులు ఆపాలని, 60 సంవత్సరాల పైబడిన వారు అనారోగ్యం పాలైన వారు సాధారణంగా లేదా ప్రమాదంలో మరణించిన మున్సిపల్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని, పెండింగ్లో ఉన్న పీఎఫ్ బకాయిలు చెల్లించాలని, పట్టణాల అభివృద్ధి కోసం లక్షల రూపాయలను వెచ్చించి తీసుకువచ్చిన యంత్రాలను వెంటనే వినియోగం లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేర్ నరసింహ, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఘట్టన్న,పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శివ, H. రవి, సిఐటియు మండల కన్వీనర్ మహేష్ కుమార్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -