Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి 

గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి 

- Advertisement -

పిహెచ్సి వైద్యులు సురేష్ 
నవతెలంగాణ – రామారెడ్డి 

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని రామారెడ్డి పిహెచ్సి వైద్యులు సురేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పిహెచ్సిలో 32 మంది గర్భిణీలకు పరీక్షలు నిర్వహించారు. వారికి సరైన మందులు అందజేశారు. ఎలాంటి సమస్య ఉన్న వైద్య సిబ్బందికి, వైద్యులకు తెలుపాలని, చలికాలం జాగ్రత్తగా ఉండాలనే సూచించారు. వైద్య సిబ్బందితో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. సీజన్ వ్యాధులపై ప్రజలను ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది, గర్భిణీలు తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -