Tuesday, November 25, 2025
E-PAPER
Homeజాతీయం28 మంది మావోయిస్టులు స‌రెండ‌ర్

28 మంది మావోయిస్టులు స‌రెండ‌ర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పుర్ జిల్లా పోలీస్ హెడ్ ఆఫీసులో మంగళవారం 28 మంది మావోయిస్టులు భద్రతా బలగాల ముందు లొంగిపోయారు. వీరిలో మాడ్ డివిజన్ కమిటీ సభ్యులు, పీఎల్‌జీఏ, ఏరియా కమిటీ సభ్యులు, మిలటరీ దళం కమాండర్, ఎల్‌ఓఎస్, జనతానా సర్కార్ సభ్యులు ఉన్నారు. దండకారణ్య ప్రాంతంలో కీలక పాత్ర పోషించిన ఈ 28 మందిపై మొత్తం రూ.89 లక్షల రివార్డు ప్రకటించి ఉన్నట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బస్తర్ డివిజన్‌లో 287 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -