Thursday, November 27, 2025
E-PAPER
Homeజిల్లాలునూతన ఆలయ నిర్మాణానికి భూమిపూజ

నూతన ఆలయ నిర్మాణానికి భూమిపూజ

- Advertisement -

నవతెలంగాణ – నర్సింహులపేట

నర్సింహులపేట మండలం పకీరతండా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి బుధవారం గ్రామస్తులు భూమి పూజ చేశారు. సుమారు రూ.15 లక్షల విలువ గల భూమిని తండాకు చెందిన భూక్య రమేష్ మంజుల దంపతులు విరాళంగా ఇచ్చారు. వివిధ పార్టీల ముఖ్య నాయకులు, ప్రముఖుల సమక్షంలో వేద పండితులు ప్రణయ్ శర్మ, వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో శాస్త్రోకంగా ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయాల నిర్మాణంతోనే ఆధ్యాత్మిక, భక్తిభావం పెరుగుతుందన్నారు. దైవచింతన మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు గూగులోతు రవి నాయక్, భూక్య శంకర్, కిషన్, రెడ్డి, రాంబాబు, లాలు, బద్రు, సురేష్, ఉదయ్, రవి, నగేష్, వీరన్న, మాన్య, నరేష్, బాలాజీ, చందులాల్, సుమన్, రమేష్ గ్రామస్థులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -