Friday, November 28, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఫూలే స్ఫూర్తితో చైతన్యం తీసుకురావాలి..

ఫూలే స్ఫూర్తితో చైతన్యం తీసుకురావాలి..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారంలో మహాత్మ జ్యోతిబా ఫూలే వర్ధంతి సందర్భంగా బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజన వర్గాలకు అవగాహన, చైతన్యం కల్పించిన మహనీయుడు ఫూలే అని నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కడార్ల నర్సయ్య, బీసి కులాల ఉద్యమ పోరాట సంఘం కరీంనగర్ జోన్ కన్వీనర్ కాసెట్టి లక్ష్మణ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య, కో కన్వీనర్ మూల భాస్కర్ గౌడ్, మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడెపు లక్ష్మీనారాయణ, బి ఆర్ ఎస్ జన్నారం మండలం ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, మాజీ ఎంపిటిసి రాగుల శంకర్, మండల పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న, బి ఆర్ ఎస్ మైనార్టీ నాయకుడు ఫజల్ ఖాన్, బొడ్డు రామన్న, దాసరి రాజన్న, బైరి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -