Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ ఎన్నికలకు రెబల్స్ బెడద.!

సర్పంచ్ ఎన్నికలకు రెబల్స్ బెడద.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతోనే పలువురు అభ్యర్థులు సర్పంచ్ గా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయా ప్రధాన పార్టీల మద్దతు మాకే ఉందంటూ ఎవరికీ వారు గ్రామాల్లో బరిలోకి దిగుతున్నారు. ఒకే పార్టీ నుంచి గ్రామంలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు ఓటర్లను, పార్టీ శ్రేణులను కలిసి మద్దతు ఇవ్వాలని కోరడంతో కార్యకర్తలకు ఎవరికీ మద్దతు ఇవ్వాలని అయోమయంలో ఉన్నారు. ఈసారి యువత పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిన్న పంచాయతీల్లో సైతం ఇద్దరికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయతీలు ఉం డగా..అందులో ఏడు గ్రామ పంచాయతీలు జన రల్ రిజర్వేషన్, బీసీలకు 3, ఎస్సీలకు 3, ఎస్టీలకు 2,జనరల్ 7 కేటాయించారు. అయితే ఆయా గ్రామాల్లో ప్రతీ పార్టీ నుంచి ఇద్దరికి పైగా అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కువగా అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మండల కేంద్రంలో ఒకే పార్టీ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఒకే పార్టీ నుంచి పోటీవారిని బుజ్జగించే పనిలో నాయకులు నిమగ్నమయ్యారు. ఆ యా పార్టీల నుంచి ఏఏ గ్రామాల్లో ఏఏ అభ్యర్థులు నామినేషన్లు వేయానున్నారో వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -