ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో భారీగా డిమాండ్
నవతెలంగాణ – మల్హర్ రావు
పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ పదవికి క్రేజ్ పెరిగింది. గ్రామాల్లో ఛోటామోటా నాయకులంతా ఇప్పుడు ఉపసర్పంచ్ పదవిపైనే దృష్టిని కేంద్రీకరించారు. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో పాటు మహిళలకు 50శాతం సర్పంచ్ స్థానాలు రిజర్వ్ కావడంతో చాలా మంది నాయకులు పోటీ చేసే అవకాశం లేకుండాపోయింది. దీంతో ఆయా గ్రామాల్లోని నాయకులంతా ఉపసర్పంచ్ పదవి కోసం రంగంలోకి దిగుతున్నారు. మండలంలో 15 గ్రామపంచాయతీలు ఉండగా, ఇందులో ఎస్టీలకు 2, ఎస్సీలకు 3, బీసీలకు 3, ఇతరు లకు 7 స్థానాలు రిజర్వ్ అయ్యాయి.ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఉపసర్పంచ్ పదవులకు డిమాండ్ పెరిగింది. చోటా మోటా నేతలంతా ఉపసర్పంచ్ పదవి కోసం రంగంలోకి దిగుతున్నారు. బీసీల్లో ఆశలు పెట్టుకొని భంగం కలిగిన నాయకులు, మహిళలకు 50 శాతం కేటాయించిన స్థానాల్లో ఆయా గ్రామాల్లో ఉపసర్పంచ్ పదవికి పోటీపడే అవకాశాలున్నాయి.
ఉప సర్పంచ్ కూ పెరిగిన క్రేజ్.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


