Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో 8 నామినేషన్ కేంద్రాల ఏర్పాట్లు పూర్తి

మండలంలో 8 నామినేషన్ కేంద్రాల ఏర్పాట్లు పూర్తి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఈనెల థర్డ్ ఫేస్ లో 17న జరగబోయే గ్రామపంచాయతీ సర్పంచుల ఎన్నికలకు గానూ మద్నూర్ మండలంలోని 21 గ్రామపంచాయతీలకు సంబంధించిన నామినేషన్ పత్రాలు సమర్పణ కోసం ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే నామినేషన్ పత్రాలకు కావలసిన వివరాల గురించి కూడా ఎంపీడీవో వెల్లడించారు. ఆ కేంద్రాల ఏర్పాటు వివరాలు ఇలా ఉన్నాయి.
1, హెచ్ కేలూర్ జిపి బిల్డింగు లో హెచ్ కెలూరు, చిన్న షక్కర్గా.
2, కొడిచర జిపి బిల్డింగు లో కొడిచర, చిన్న ఎక్లారా, అవల్గావ్.
3, మద్నూర్ జిపి బిల్డింగ్.
4, మేనూర్ జిపి బిల్డింగు లో మేనూర్, శాఖాపూర్.
5, పెద్ద ఎక్లారా, రాచూర్, దన్నూర్ ,సోమూర్.
6, సుల్తాన్ పేట్ జిపి బిల్డింగులో సుల్తాన్ పేట్, లచ్చన్, రుశేగావ్.
7 పెద్ద తడగూర్ జిపి బిల్డింగు లో పెద్ద తడగూర్, చిన్న తడగూర్, అంతాపూర్.
8 మద్నూర్ ఎంపీడీవో కార్యాలయ బిల్డింగు లో పెద్ద షకర్గా, గోజేగావ్, తడి ఇప్పర్గ.

ఈ విధంగా నామినేషన్ల పత్రాలు సమర్పణ కోసం కేంద్రాలు ఏర్పాటు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలకు కావలసిన వివరాల గురించి ఎంపీడీవో తెలియజేశారు. నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి ఓటర్ ఐడి ప్రతిపాదకుని ఓటర్ ఐడి కులం సర్టిఫికెట్ కొత్తగా బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీలు సమర్పించవలసి ఉంటుందని వీటితోపాటు గ్రామపంచాయతీ నుండి అభ్యర్థి, ప్రతిపాదకుని యొక్క నో డ్యూ సర్టిఫికెట్లు సమర్పించాలని ఎంపీడీవో తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -