నవతెలంగాణ – కంఠేశ్వర్
మరమ్మతులు కొనసాగుతున్న దృష్ట్యా నవీపేట వద్ద గల 188 నెంబర్ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటును 2025 డిసెంబర్ 3, 4వ తేదీలలో మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బి.శ్రీనివాస్ తెలిపారు. మరమ్మత్తులు, డబ్లింగ్ పనులు చేపట్టాల్సిన కారణంగా ఈ నెల 3 ఉదయం 6.00 గంటల నుండి ఆ మరుసటి రోజు అయిన 4వ తేదీ సాయంత్రం 6.00 గంటల వరకు రైల్వే గేటు మూసి ఉంచబడుతుందని అన్నారు. 4వ తేదీన సాయంత్రం 6.00 గంటల అనంతరం రైల్వే గేటును తెరుస్తామని, రాకపోకలు యధావిధిగా పునరుద్ధరించబడతాయని తెలిపారు.
ప్రయాణికులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి, మరో రెండు రోజుల పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు జరపాలని సూచించారు. నిజామాబాద్-బాసర మార్గంలో ప్రయాణించాల్సిన ద్విచక్ర వాహనదారులు కమలాపూర్ మహంతం, మొకనపల్లి, గుండారం మీదుగా, ఇతర వాహనదారులు కల్యాపూర్, సాటాపూర్, తడ్బిలోలి, ఫకీరాబాద్ మీదుగా రాకపోకలు సాగించాలని సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బీ.శ్రీనివాస్ కోరారు.



