Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాభివృద్ధి కోసమే వేలం పాటలు 

గ్రామాభివృద్ధి కోసమే వేలం పాటలు 

- Advertisement -

గ్రామాల్లో వేడెక్కుతున్న పంచాయతీ ఎన్నికలు 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

బాన్సువాడ నియోజవర్గంలోని నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో ఏకగ్రీవాలు జోరందుకుంటున్నాయి. నసురుల్లాబాద్ మండలంలో ఇప్పటికీ మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం దిశగా ఉండగా మరో మూడు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అలాగే బీర్కూర్ మండలంలో 5 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంటుందని కాగ్రెస్ పార్టీలో ఉన్న ఓ గ్రూప్ లీడర్స్ అన్నారు. నేటి నుంచి నామినేషన్ల హడావుడి, గ్రూపు రాజకీయాలు, విజయం కోసం ఎత్తులు పైఎత్తులతో కూడిన రాజకీయాలతో వేడెక్కే గ్రామాలు కూడా చిత్రంగా ఐక్యతా రాగం వినిపిస్తున్నాయ్‌. పోటీ చేసే మీలో ఎవరైతే నేమి వేలంపాటలో పోటీపడండి.. సర్పంచ్‌ అవ్వండి అంటూ ప్రజలు ఆఫర్లు ఇస్తున్నారు. సర్పంచ్‌ పదవులకు వేలం నిర్వహించడంపై ఈసీ హెచ్చరించినా లెక్క చేయడం లేదు.. పోటీలో ఉండి పోటాపోటీగా ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయడం కంటే గ్రామాభివృద్ధి కోసం వేలం పాట నిర్వహించి పదవిని ఏకగ్రీవం చేసుకుంటే తప్పేంటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

ఏకగ్రీవం పై ముగ్గు 
నసురుల్లాబాద్ మండలంలోని మూడు గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించి పదవులను దక్కించుకున్నారని సమాచారం. ఇందులో ఒకరు 25 లక్షలు పెట్టి సర్పంచ్ పదవి కైవాసం చేసుకోగా మరొకరు ఆరు లక్షలు పైగా ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలిసింది. 

గ్రామాల్లో సర్పంచ్‌ పదవికి ఎన్నడూ లేని డిమాండ్‌ పెరుగుతోంది. సర్పంచ్‌ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు అనేక ఆఫర్లు చేస్తున్నారు. ఆఫర్లు, ఒప్పందాలు, ఒట్లు, బాండ్లు తదితర అంశాలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినప్పటి నుంచి బాన్సువాడ నియోజవర్గంలోని పలు గ్రామాల్లో బుజ్జగింపుల పర్వం మొదలైందని చెప్పొచ్చు. సర్పంచ్ ఎన్నికల్లో నిలబడటం, ఓటర్లను ఓటు అభ్యర్థించడం, డబ్బులు పంచడం లాంటి లాంగ్‌ ప్రాసెస్‌కు స్వస్తి చెప్పి ఏకంగా ‘ఏకగ్రీవం’ అయితే ఎలాంటి లొల్లి ఉండదనే అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో గ్రామాల్లో సర్పంచ్‌ పదవికి ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి. 

దేవుడి మీద ఒట్లు…మీ వెంటే ఉంటా..
సర్పంచ్‌ పదవి ఇస్తే గ్రామానికి ఏం చేస్తామో ముందే చెప్పి అవసరమైతే ఊరి దేవుళ్ల మీద ఒట్టు పెడతామని కూడా కొందరు ఆశావహులు చెప్తుండటం విశేషం. గ్రామ దేవతలపై ఒట్టుపెట్టి చెప్తున్నా…గ్రామాభివృద్ధికి కృషి చేస్తా… మీ వెంటే ఉంటా అంటూ కూడా ప్రమాణాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. సర్పంచ్‌ అయితే ఏయే పనులు చేస్తానో రూ.100 బాండ్‌ పేపర్‌ రాసిస్తానని మరికొందరు హామీలు ఇస్తున్నట్లు సమాచారం. నామినేషన్ల పర్వం ముగిసే లోపు ఎట్టకేలకు ఏకగ్రీవంగా సర్పంచ్‌ పదవిని దక్కించుకోవాలనే ఆకాంక్షతో పలువురు నాయకులు అనేక వాగ్దానాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల బహిరంగంగా సర్పంచ్‌ పదవికి వేలం పాటలు నిర్వహించడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -