– విజేతలకు బహుమతులు అందజేసిన ఎంఈఓ ఆంధ్రయ్య
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో మంగళవారం మండల ఇంగ్లీష్ ఉపాధ్యాయుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మండల స్థాయి ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్ నిర్వహించారు. ఇంగ్లీష్ భాషలోని నైపుణ్యత, కామ్మ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడానికి టీఎస్ సిఈఆర్ టి, భారతి ఎయిర్ టెల్ ఫౌండేషన్ సహకారంతో మండల స్థాయి ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్ నిర్వహించారు.
పోటీలలో భాగంగా ఉపన్యాసం జూనియర్ విభాగంలో మొదటి బహుమతి పి.చిన్నబాబు( జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,బషీరాబాద్), ద్వితీయ బహుమతి రూపేష్ (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చౌట్ పల్లి), సీనియర్ విభాగంలో మొదటి బహుమతి జె.అమూల్య( జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బషీరాబాద్), ద్వితీయ బహుమతి సిహెచ్.మధుప్రియ గెలుపొందారు.అదే విధంగా వ్యాస రచన పోటీల్లో జూనియర్ విభాగంలో ఎం.శివాగౌడ్( జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొన సముందర్), ద్వితీయ బహుమతి ఎస్.ప్రసన్న( జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చౌట్ పల్లి), సీనియర్ భాగంలో మొదటి బహుమతి పి. కార్తికేయ( జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కమ్మర్ పల్లి), ద్వితీయ బహుమతి కే. సందీప్( జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొన సముందర్) గెలుపొందారు. విజేతలకు మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేశారు. మండల అబ్సర్వర్ గా మోర్తాడ్ మండల ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు గున్నాల రవి వ్యవహరించారు.కార్యక్రమంలో ఎల్టా ఉపాధ్యాయులు ఏ.రవీంద్ర, కే.మహికాంత్, వి మధు బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


