నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని క్లస్టర్ నామినేషన్ కేంద్రాలను బుధవారం మండల స్థాయి అధికారులు పరిశీలించారు. మండలంలో క్లస్టర్ నామినేషన్ కేంద్రాలైన కోనాపూర్, కోన సముందర్ నామినేషన్ కేంద్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్, కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి, ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ ఇంచార్జ్ రాజన్న, మండల పంచాయతీ అధికారి సదాశివ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాలను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు, సిబ్బందికి సూచించారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులకు అవసరమైన సహాయ సహకారాన్ని అందించాలని సహాయ కేంద్రం సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
క్లస్టర్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


