- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఒక విద్యార్థిని గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొన్ని నెలలుగా శారీరక సంబంధం పెట్టుకున్న ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్, మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన దృశ్యాలతో విద్యార్థినిని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. విద్యార్థిని ఫిర్యాదుతో, యూనివర్సిటీ అధికారులు ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేశారు. వైస్ ఛాన్సలర్ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదు మేరకు ఇద్దరు ప్రొఫెసర్లపై కేసు నమోదు చేశారు.
- Advertisement -



