Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్అపూర్వం… అద్వితీయం

అపూర్వం… అద్వితీయం

- Advertisement -

1997-98 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన1997-98 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం  అపూర్వం అద్వితీయం అన్నట్లుగా అద్భుతంగా సాగింది.ఈ  సమ్మేళన కార్యక్రమానికి స్థానిక శ్రీహర్ష బంకిట్ హాల్ వేదికయ్యింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల వరకు ఆద్యంతం కోలాహలంగా కొనసాగింది. సుమారు 27 సంవత్సరాల క్రితం విడిపోయిన మిత్రులంతా ఒకచోట కలుసుకున్నారు. చిన్ననాటి మిత్రులను చూసి ఉప్పొంగిపోయారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక్కచోటకు చేరారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బాల్య మిత్రులతో సరదాగా గడిపారు.నాటి ఆ పాత మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆడి పాడారు.తమకు మార్గదర్శనం చేసిన ఆనాటి గురువులు తిరుపతి రెడ్డి, సాయిల్, శంకర్, గంగాధర్ లను శాలువా పూలమాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. వారు చెప్పిన బోధనలు తమ జీవితాలకు ఎలా బాటలు వేశాయో సోదాహరణంగా వివరించారు. పూర్వ విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు సైతం మురిసి పోయారు. వయస్సు మరిచి వారితో కలిసి పోయారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం చేసి, దీవేనలు తీసుకున్నారు.వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం అందరూ కలిసి గ్రూప్ ఫోటోలు దిగి, ఆత్మీయంగా సామూహిక భోజనాలు చేశారు.ముందు తాము చదివిన పాఠశాలను, తరగతి గదులను సందర్శించి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.పాఠశాల స్టేజి ముందు పూర్వ విద్యార్థులందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కిషన్, పాషా, బాలకృష్ణ, శేఖర్, శ్రీనివాస్, నరేష్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -