నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్ కె హాస్పిటల్ హాస్పిటల్ అధ్యాపకుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా విశేష స్పందన లభించినట్లు హాస్పిటల్ అధినేత డాక్టర్ చావ రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా చావా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ అధ్యాపకులు ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దగలరని ఆరోగ్యమే మహాభాగ్యం అని పేర్కొన్నారు. అధ్యాపకులందరూ వారి కుటుంబ సభ్యులతో కలిసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు దీనిలో గుండె ,లివర్, కిడ్నీ ,చర్మ సంబంధమైన, ప్రత్యేకంగా డాక్టర్ అశ్లేష , డెంటల్ సంబంధ మైన వైద్య సేవలు అందించారు దానికి కావాల్సిన పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించారు. భువనగిరి శ్రీ చైతన్య, గాయత్రి, పద్మావతి, వైష్ణవి, టైమ్స్, వాగ్దేవి పట్టణంలోని వివిధ కళాశాలల అధ్యాపకులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత వైద్య శిబిరానికి అధ్యాపకులు యంగ్ ఇండియా యంగ్ లీడర్షిప్, చావా ఫౌండేషన్, ఆర్కే హాస్పిటల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వై ఐ వై ఎల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధగాని మహేశ్వర్ గౌడ్, వైస్ చైర్మన్ అంబోజు మల్లేశం, జాయింట్ సెక్రెటరీ యేంపల్ల కొండల్ రెడ్డి, అధ్యాపకులు మహేష్, హేమలత ట్రెజరీ వెంకట్ రాజు గౌడ్, జాయింట్ డైరెక్టర్ గాజుల వెంకటేష్ గౌడ్, శ్రవణ్ రెడ్డి ,సంపత్ కుమార్ గౌడ్, శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.
అధ్యాపకుల ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES