Monday, December 8, 2025
E-PAPER
Homeజాతీయంవందేమాతరంపై చ‌ర్చ‌.. బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్: ఎంపీ ప్రియాంకాగాంధీ

వందేమాతరంపై చ‌ర్చ‌.. బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్: ఎంపీ ప్రియాంకాగాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: దేశంలోని ఎన్నికల సంస్కరణలపై చర్చ పెట్టకుండా దాని నుంచి దృష్టి మరల్చాడానికే కేంద్ర ప్రభుత్వం వందేమాతరంపై చర్చ పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించిందని ఎంపీ ప్రియాంకాగాంధీ ఆరోపించారు. బెంగాల్‌లో త్వరలో జరగునున్న ఎన్నికల కోసమే కేంద్రం ఈ కొత్త స్టంట్ మెుదలుపెట్టింద‌ని విమ‌ర్శించారు. పార్లమెంట్ లో వందేమాతరంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు.

వందేమాతరం పై చర్చ పేరుతో దేశం కోసం పోరాటం చేసిన స్వాతంత్ర్య సమర యోధులపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీ ఎప్పుడు ప్రజలకు గతమే చూపిస్తుందని భవిష్యత్తు ఆ పార్టీ చూడదని ప్రజలను చూడనివ్వదని దుయ్యబట్టారు. మోదీకి మాటలు ఎక్కువ చేతలు తక్కువని, డైవర్ట్ పాలిటిక్స్ చేయడం బీజేపీకి వెన్నెతో పెట్టిన విద్య అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -