మాజీ సర్పంచ్ లు గంగామణి-నర్సింహులు గౌడ్
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని హండెకేలూర్ గ్రామానికి సతిపతులైన గంగామణి నర్సింలు గౌడ్ ఆదర్శం. ఎందుకంటే ఈ గ్రామానికి గతంలో గంగామణి ఒకసారి సర్పంచ్ గా ఎన్నిక కాగా.. ఆ తర్వాత రెండు సార్లు నర్సింలు గౌడ్ సర్పంచిగా ఎన్నికయ్యారు. ఆ రెండింటిలో ఒకసారి నర్సింలు గౌడ్ కు గ్రామస్తులంతా ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నారు. హండెకేలూర్ గ్రామ ప్రజల అవసరాలకు గాను గ్రామ అభివృద్ధికి గాను సత్తిపత్తులు ఎల్లవేళలా సేవలందిస్తూ గ్రామ ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందారు. ఈమధ్య కొన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్లు అమలు కావడంతో ఈ కుటుంబీకులు ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు.
ప్రస్తుతం సర్పంచ్ ఎన్నిక జనరల్ గా రిజర్వు కావడంతో మళ్లీ గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే ప్రజా సేవలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానంటూ నరసింహులు గౌడ్ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. ఇతను దేవాదాయ ధర్మాదాయ శాఖ సలబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్గా రెండు పర్యాయాలు పదవులు చేపట్టారు. హండెకేలూర్ కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. నేను చేసిన గ్రామ అభివృద్ధిని చూసి ఎల్లవేళల రాత్రింబవళ్లు ప్రజాసేవకే అంకితం అయ్యే సేవను చూసి మళ్లీ సర్పంచ్ గా గ్రామ ప్రజలు తనను గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు వారు ఆశాభావం వ్యక్తం చేశారు.



