Friday, December 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రపతి హైదరాబాద్‌ టూర్‌ ఖరారు

రాష్ట్రపతి హైదరాబాద్‌ టూర్‌ ఖరారు

- Advertisement -

శీతాకాల విడిదిలో భాగంగా
ఈనెల 17 నుంచి 21 వరకు బస
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఐదు రోజుల రాష్ట్ర పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్‌లోని బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీసు శాఖ భద్రతా, ట్రాఫిక్‌, ప్రణాళికను రూపొందించాలనీ, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు ఫైర్‌ టెండర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యారోగ్య, రోడ్డు భవనాలు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ తదితర అన్ని ప్రభుత్వ విభాగాలు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్‌ క్యాచర్‌ బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతులు, తేనెటీగ లను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో డీజీపీ శివధర్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ.ఆనంద్‌, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, పొలిటికల్‌ కార్యదర్శి ఈ. శ్రీధర్‌, అదనపు డీజీపీ మహేష్‌ భగవత్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ.కర్ణన్‌, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ శివలింగయ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -