Friday, December 12, 2025
E-PAPER
Homeకరీంనగర్వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్‌పై కత్తులతోదాడి..

వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్‌పై కత్తులతోదాడి..

- Advertisement -

– పరామర్శించిన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ: వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుపై జరిగిన దాడి ఘటనపై స్థానికంగా ఆందోళన నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వ్యక్తులు రొండి రాజుపై దాడికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపిన రాజు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.దాడి జరిగిన విషయం తెలుసుకున్న వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెంటనే ఆస్పత్రికి చేరుకుని రొండి రాజును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆది శ్రీనివాస్, నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం రొండి రాజు ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -