Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేనూరు సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ పెద్దలు ప్రదీప్ కుమార్ దేశ్ పాండే

మేనూరు సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ పెద్దలు ప్రదీప్ కుమార్ దేశ్ పాండే

- Advertisement -

పెద్దల వైపు మొగ్గు చూపుతున్న జనాలు
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఆ గ్రామ పెద్దలు ప్రదీప్ కుమార్ దేశ్పాండే పోటీ చేస్తున్నారు. ఆ గ్రామ పెద్దల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఈయన తాతల నాటి నుండి ఈ గ్రామానికి పెద్ద మనుషులుగా ఉన్నారు. ఈయనకు గ్రామ ప్రజల్లో మంచి మనిషిగా పేరుంది. ఈ కుటుంబీకులు జనాలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటారు. దగ్గరుండి వారి సమస్యలను పరిష్కరించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈయన ఏళ్ల తరబడి ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఈసారి పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి జనరల్ రిజర్వ్ ఖారారైంది. ఈ క్రమంలో ప్రజల మేలుకోసం, గ్రామాభివృద్ది కోసం ప్రదీప్ కుమార్ దేశ్పాండే ప్రజాసేవ కోసం ముందుకు వచ్చారు. గ్రామ సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ప్రదీప్ కుమార్ దేశ్పాండే మాట్లాడుతూ .. అవకాశం ఇచ్చి గెలిపిస్తే గ్రామానికి ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -