Friday, December 12, 2025
E-PAPER
Homeజిల్లాలుబస్సు అద్దాలను ధ్వంసం చేసిన యువకుడు

బస్సు అద్దాలను ధ్వంసం చేసిన యువకుడు

- Advertisement -

నవతెలంగాణ – పెద్ద కొడప్ గల్
మండల కేంద్రంలో ఓ యువకుడు బస్సు అద్దాలను ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్-2 Ts 08z 0011 డిపోకు చెందిన బస్సు తిరుగు ప్రయణంలో బిచ్కుంద నుండి పెద్ద కొడప్ గల్ మీదుగా హైదరాబాద్ కి వెళ్తుంది. మండలంలోని బస్సు స్టాప్ లో బస్సును ఆపారు. అయితే బస్సులో ఓ యువకుడు ఎక్కాడు. బస్సు ఇంకా కదలని సమయంలో కండక్టర్ మధ్యలో చిన్న కొడప్ గల్ కు స్టాప్ లేదని చెప్పారు. దింతో ఆగ్రహానికి లోనైన యువకుడు బస్సు దిగి బస్సు వెనుక భాగంలో ఉన్న అద్దాలను రాయితో కొట్టి పగలగొట్టాడు. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ కేతవత్ రందాస్ పరుగులు పెట్టిన యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. సదరు యువకుడి పై విచారణ జరిపి కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ అరుణ్ కుమార్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -