Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల సంక్షేమం, గ్రామాలభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం: ఎమ్మెల్యే తోటా

పేదల సంక్షేమం, గ్రామాలభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం: ఎమ్మెల్యే తోటా

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం తో పేదల సంక్షేమం గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రజలను కోరారు. మద్నూర్ మండలంలోని సోమూర్ అంతాపూర్, పెద్ద తడగూర్, చిన్న ఎక్లారా, కొడిచెర, పెద్ద ఎక్లారా, ధనుర్, మద్నూర్, డోంగ్లి, మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలను ఎమ్మెల్యే విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచుల గెలుపు కోసం  పర్యటనలు జరిపారు. ప్రతి గ్రామంలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ప్రజా సంక్షేమం కోసం గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలు ప్రగతి సాధించాలంటే అధికార పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఈ ప్రచార సభల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆయా గ్రామాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -