Wednesday, December 17, 2025
E-PAPER
Homeకరీంనగర్జిల్లాలో ముగిసిన మూడవ  విడత పంచాయతీ ఎన్నికలు

జిల్లాలో ముగిసిన మూడవ  విడత పంచాయతీ ఎన్నికలు

- Advertisement -

మండలాల్లో పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడో విడత పంచాయితీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ మహేష్ బీ గీత అన్నారు. గంభీరావుపేట ముస్తాబాద్ వీణపల్లి ఎల్లారెడ్డిపేట మండలాల్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను ఆయన పర్యవేక్షించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారని సూచించారు. పెట్రోలింగ్ వాహనాలు, ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షించాయని ఎస్పీ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -