నాటి సర్పంచులు నేటి ఎంపీటీసీలు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని 34 గ్రామపంచాయతీలలో జరిగిన గ ఎన్నికల్లో మాజీ ఎంపీటీసీలు సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందారు. ముత్తిరెడ్డిగూడెం పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ రిజర్వ్ చేయడంతో గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సభ్యుడు రాంపల్లి కృష్ణ బరిలో నిలిచారు రాంపల్లి కృష్ణ గౌడ్ కి 1120 ఓట్లు రాగానే సమీప అభ్యర్థి కొండా స్వామి కి 331 వచ్చాయి. దింతో 789 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ గా కృష్ణ గెలుపొందారు.
కునూరులో..
మండలంలోని కునూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్ సీ రిజర్వేషన్ కాగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు పాశం శివానంద్ గెలుపొందారు. మొత్తం ఓట్లు 1162 పోలింగ్ కాగా ఇందులో శివా నంద్ కు 605 ఓట్లు, సమీప అభ్యర్థి శంకర్ కు 547 ఓట్లు వచ్చాయి. 58 ఓట్లతో సర్పంచ్ గా శివానంద్ గెలుపొందారు. 10 ఓట్లు చెల్లని ఓట్లు వచ్చాయి. నాడు ఎంపిటిసి గా ఉండి నేడు సర్పంచులుగా పోటీ చేసి గెలవడంతో మండల వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.



