నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డా. సంధ్య గోలీ సమర్పణలో నిర్మాతలు వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు.
మురళీ మనోహర్ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం హీరో నరేష్ అగస్త్య మీడియాతో సంభాషించారు.
ఇలాంటి మూవీ చేయలేదు.
గతంలో నేను నటించిన చిత్రాల్లో నా క్యారెక్టర్స్ సెటిల్డ్‌గా ఉంటాయి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం ఎనర్జిటిక్‌గా, నేనే లీడ్ తీసుకునేలా ఉంటుంది. నేను ఇప్పటిదాకా ఇలాంటి మూవీ చేయలేదు. మా డైరెక్టర్ చెప్పిన ఈ కథ బాగా నచ్చింది.
శవం కోసం వేట..
ఈ కథలో నేనొక పని కోసం వస్తాను. ఆ పని చేసేందుకు కొందరు తెలివిలేని వాళ్లు కావాలి. వాళ్లు నన్ను ప్రశ్నించినా మ్యానేజ్ చేయగలిగిన వాళ్లనే సెలెక్ట్ చేసుకుంటా. నేను వచ్చిన పని ఏంటి అనేది ట్రైలర్‌లో కూడా రివీల్ చేయలేదు. ఒక శవం కోసం వేట సాగిస్తుంటాం. ఆ శవం ఎవరిది, ఏంటి అనేది కథలోని మెయిన్ పాయింట్. తెలివైన వాడు తెలివితక్కువ పనిచేస్తే, తెలివి లేని వాళ్లు తెలివైన పనిచేస్తే వాళ్ల జీవితాల్లో వచ్చిన పరిణామాలు ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ లైన్.
ప్రేక్షకులు నవ్వుకునేలా..
ఎవరైనా కొన్ని ఇబ్బందుల్లో ఉంటే వాడికి బాధ. కానీ మనకు నవ్వొస్తుంది. అదే డార్క్ కామెడీ. ఈ మూవీలోని క్యారెక్టర్స్ ఇబ్బంది పడుతుంటే ఆ సందర్భాలు ప్రేక్షకులు నవ్వుకునేలా ఉంటాయి. సినిమా అంతా ఫన్‌జోన్‌లో వెళ్తుంటుంది. ఈ మూవీకి బలమైన కథ ఉంది. ప్రతి సీన్ కామెడీగా వెళ్తున్నా వెనక ఒక స్ట్రాంగ్ స్టోరీ రన్ అవుతుంటుంది. ఇంటర్వెల్‌కు ఆడియెన్స్ షాక్ అవుతారు. మా ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ముఖ్యంగా అమర్ సినిమా అనుకున్న బడ్జెట్ పెరిగినా క్వాలిటీ తగ్గకుండా చూసుకున్నారు. యోగి బాబు, బహ్మానందం పాత్రలు అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తాయి. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నటన పరంగా నాకెంతో సంతృప్తినిచ్చింది.
శక్తివంతమైన కథ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



