Thursday, December 18, 2025
E-PAPER
Homeజాతీయంరైళ్లలో అధిక లగేజీపై అదనపు చార్జీలు

రైళ్లలో అధిక లగేజీపై అదనపు చార్జీలు

- Advertisement -

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌

న్యూఢిల్లీ: రైళ్లలో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. తరగతిని బట్టి కొంత మేర లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చన్న ఆయన.. పరిమితి మించితే అదనపు రుసుము చెల్లించక తప్పదన్నారు. విమానాశ్రయాల్లో అనుసరిస్తున్న మాదిరిగా రైళ్లలోనూ లగేజీ నిబంధనలు అమలు చేస్తారా? అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి లోక్‌సభలో సమాధానమిచ్చారు. తరగతిని బట్టి ప్రయాణికులు తమ వెంట కంపార్ట్‌మెంట్‌లో తీసుకెళ్లే లగేజీపై పరిమితి ఉందని తెలిపారు. ఉచితంగా తీసుకెళ్లగలిగే లగేజీ, చార్జీ చెల్లించి తీసుకెళ్లాల్సిన గరిష్ట పరిమితి వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. సెకండ్‌ క్లాస్‌లో ఉచితంగా 35 కేజీల వరకు తీసుకెళ్లొచ్చని, చార్జీలు చెల్లించి 70 కేజీల వరకు లగేజీని వెంట తీసుకెళ్లొచ్చన్నారు. అదే స్లీపర్‌ క్లాస్‌లో అయితే ఉచితంగా 40 కేజీలు, చార్జీలు చెల్లించి 80 కేజీలుగా పేర్కొన్నారు.

ఏసీబోగీల్లో..
థర్డ్‌ ఏసీ లేదా చైర్‌ కార్‌లో ఉచితంగా 40 కేజీలు మాత్రమే తీసుకెళ్లొచ్చని మంత్రి పేర్కొన్నారు. ఫస్ట్‌ క్లాస్‌, ఏసీ 2 టైర్‌లో ప్రయాణికులు 50 కేజీల వరకు ఉచితంగా తీసుకెళ్లొచ్చని, 100 కిలోల వరకు గరిష్టంగా లగేజీని ఛార్జీలు చెల్లించి వెంట తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు. ఏసీ ఫస్ట్‌ క్లాస్‌ ప్రయాణికులు 70 కేజీలు ఉచితంగా, 150 కేజీలు వరకు చార్జీ చెల్లించి తీసుకెళ్లొచ్చని తెలిపారు. గరిష్ట పరిమితి అనేది ఉచిత పరిమితితో కలిపి లెక్కిస్తామని పేర్కొన్నారు.ఉచిత పరిమితికి మించి ఎవరైనా లగేజీ తీసుకెళ్లాల్సిన వారు ముందుగా లగేజీ బుక్‌ చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే, 100 సెంటిమీటర్లు , 60 సెంటిమీటర్లు 25 సెంటిమీటర్ల కొలతలకు లోబడి ఉన్న ట్రంక్స్‌, సూట్‌కేస్‌లు, బాక్సులను మాత్రమే కంపార్ట్‌మెంట్లోకి అనుమతిస్తామని, అంతకంటే పెద్దగా ఉన్న వాటిని బ్రేక్‌వ్యాన్‌/ పార్సిల్‌ వ్యాన్‌లో తరలించాల్సి ఉంటుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -