సీఎం రేవంత్‌రెడ్డి మైండ్‌బ్లాక్ : మాజీమంత్రి హరీశ్‌రావు
తూప్రాన్, వంగూరు మండలాల్లోని సర్పంచులకు అభినందన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలంలో మల్కాపూర్, కోనైపల్లి, నర్సంపల్లి గ్రామాలతోపాటు అచ్చంపేట నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత మండలం వంగూరులో పది గ్రామాల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులకు మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం వారు హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచులకు శాలువాలతో సత్కరించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత మండలం వంగూరులో కాంగ్రెస్ ప్రలోభాలను తట్టుకుని గెలిచిన సర్పంచులను ప్రత్యేకంగా అభినందించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని అన్నారు.
ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలిందని చెప్పారు. ఓటమి భయంతో పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని వివరించారు. కేసీఆర్ పాలనలో ఢిల్లీలో తెలంగాణ పల్లెలకు అవార్డు వస్తే ఇప్పుడు రేవంత్ హయాంలో ఒక్క అవార్డు కూడా రావడం లేదని అన్నారు. పల్లెలు అపరిశుభ్రంగా మారాయని చెప్పారు. కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనాలు, డంపు యార్డులు మూలకు పడ్డాయనీ, అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదనీ, దాడులు మానుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిఘా వెళ్తోందనీ, మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేననీ, కేసీఆరే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే ఫలితాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



