Friday, December 19, 2025
E-PAPER
Homeజాతీయంవీధి కుక్కల కేసు..జనవరి 7కి వాయిదా

వీధి కుక్కల కేసు..జనవరి 7కి వాయిదా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వీధి కుక్కల కేసు విచారణను వ‌చ్చే ఏడాది జనవరి 7వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. మానవత్వం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తూ.. తదుపరి విచారణలో ఒక వీడియోను ప్లేచేస్తామని తెలిపింది. అనంతరం విచారణను జనవరి 7కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

వీధి కుక్కల కేసులో ఢిల్లీ మునిసిపల్‌ కార్పోరేషన్‌ (ఎంసిడి) రూపొందించిన కొన్ని నిబంధనలను వ్యతిరేకిస్తూ ఒక పిటిషనర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాటి పట్ల అమానవీయ ప్రవర్తన కనిపిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎంసిడి పూర్తి విరుద్ధంగా కొన్ని నిబంధనలను రూపొందించిందని, డిసెంబర్‌లోనే అధికారులు ఈ నిబంధనలను అమలు చేయవచ్చని పిటిషనర్‌ తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. వీధి కుక్కలను తొలగించవచ్చని, అయితే వాటి కోసం షెల్టర్స్‌ నిర్మాణం పూర్తి కాలేదని లేవని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -