Tuesday, April 21, 2026
E-PAPER
Homeజాతీయంఏపీలో తెల్లవారుజామున భూకంపం..

ఏపీలో తెల్లవారుజామున భూకంపం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలోని పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు EMSC, NCS ధ్రువీకరించాయి. వినుకొండ, దర్శి ప్రాంతాల్లో ప్రకంపనల వల్ల వస్తువులు కదిలి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -