Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సగానికి పైగా కొత్తవారే..

సగానికి పైగా కొత్తవారే..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రాజకీయాల్లోకి వచ్చే నాయకులు గ్రామాల నుంచే తయారు కావాల్సిందే.అలాంటి నాయకులను తయారుచేసే మొదటి గుర్తింపు తెచ్చే స్థానం సర్పంచ్లదే. మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఈ సారి సగానికి పైగా గ్రామాల్లో సర్పంచ్లుగా గెలుపొందిన వారు అంతా కొత్త వారే కావటం విశేషం.సాధారణంగా సర్పంచుల పోటీలలో గతంలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారే ఎక్కువగా కనిపిస్తుంటారు.

వారికి అంతో ఇంతా రాజకీయంతో ప్రజలతో పరి చయాలు ఉంటాయి. కానీ ఎలాంటి అనుభవం తమ కుటుంబాలు రాజకీయంగా ఎవరి లేనివారు సర్పంచ్లుగా గెలుపొందారు. మండలంలో మొత్తం 15 మంది సర్పంచులు ఉంటే ఇందులో సగానికి పైగా దాదాపు 11 మంది సర్పంచులుగా గెలుపొందిన వారు మొదటిసారిగానే రాజకీయం లోకి వస్తున్నారు. మిగత వారు వారి కుటుంబాల నుంచి రాజకీయం అనుభవం ఉన్న వారు గతంలో వార్డు సభ్యులుగా,మండలస్థాయి నాయకులుగా ఉన్న వారు గెలుపొందారు. ఇందులో 6 మంది మహిళలు,9 మంది పురుషులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -