నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు నాయకత్వాన్ని మెచ్చి సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చిన జుక్కల్ ప్రజల తీర్పును ఎమ్మెల్యే స్వాగతిస్తూ ప్రజలకు అభినందనలు తెలిపారు. జుక్కల్ అసెంబ్లీ పరిధిలోని
మొత్తం గ్రామ పంచాయతీలు = 164
కాంగ్రెస్ (INC) = 127 (77 % )
బీఆర్ఎస్ (BRS) = 30 (18 % )
బీజేపీ (BJP) = 04 ( 2. 5 % )
స్వతంత్ర అభ్యర్థులు = 4 (2.5 % )
ఎమ్మెల్యే జుక్కల్ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళల అండగా ఉంటూ అభివృద్ధి పట్ల పట్టుదలతో పని చేయడమే స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు బ్రహ్మరథం పట్టారు. 77 శాతం విజయాన్ని అందించడం చుక్కల అభివృద్ధికి బాటలు ప్రజలు వేశారని ప్రజల తీర్పు పట్ల ఎమ్మెల్యే అభినందించారు.



